కనీసం మంచి పనులనైనా త్రికరణ శుద్ధిగా (మనోవాక్కర్మలతో) చేస్తే అవి సత్పలితాలను ఇస్తాయి. గత 10 - 15 సంవత్సరాలుగా క్రమక్రమంగా అసత్యాలు, కపటము, మోసము, వంచన, అవినీతి వంటివి వామనావతారం వలె పెరిగిపోతున్నాయి. ఇందుకు కారణాలు ఎన్నో? తన దాక వస్తే కానీమనకు వీటి ప్రబావం తెలియడం లేదు. కాస్త అనవసర పోటీని, బౌతిక పరుగును, బాహ్య వస్తువుల పట్ల మోజును కాస్త తగ్గించుకుని త్రికరణ శుద్ధిగా అంతర్ముఖం అయితే ఈ జీవితం పట్ల నిజమైన అవగాహన వస్తుంది. పోటీలు, ఒత్తిడులు, పరుగులు తగ్గుతాయి, సంతృప్తితో మొదలై నిజమైన మానవతా విలువలు అలవడి ఆనందం అనుభవమవుతుంది.
మరిన్ని వివరాలతో కలుస్తాను.
మీకందరికీ ఆరోగ్యము, సంతోషం, ప్రశాంతత & దివ్యానందం చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి
మరిన్ని వివరాలతో కలుస్తాను.
మీకందరికీ ఆరోగ్యము, సంతోషం, ప్రశాంతత & దివ్యానందం చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి